భారత రక్షణ శాఖకు ఇళయరాజా తన ఒకరోజు వేతనం విరాళం

భారత రక్షణ శాఖకు ఇళయరాజా తన ఒకరోజు వేతనం విరాళం

ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా భారత రక్షణ శాఖకు తన ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. పహల్గామ్‌లో భారత పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇళయరాజా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. “పహల్గామ్‌లో మన దేశ పర్యాటకులపై ఉగ్రమూక దాడి చేసింది. దీనికి మన దేశ సైనికులు తప్పక ప్రతీకారం తీర్చుకోవాలి. వారి ధైర్య సాహసాలు అభినందనీయం. మన సైనికులు ఆత్మస్థైర్యంతో వారిని మట్టు పెడతారనే నమ్మకం నాకు ఉంది. దేశ పౌరుడిగా, ఎంపీగా నా ఒకరోజు వేతనాన్ని దేశ రక్షణ శాఖకు విరాళంగా ప్రకటిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

editor

Related Articles