హీరో విశాల్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పిన టీమ్

హీరో విశాల్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పిన టీమ్

హీరో విశాల్ ఆదివారం విల్లుపురంలో జరిగిన మిస్ కూవగం 2025 కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక్కసారిగా వేదికపై కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. అయితే, విశాల్ టీమ్ తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టతనిచ్చింది. విశాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. వడదెబ్బ లేదా అలసట కారణంగా ఆయన అస్వస్థతకు గురయ్యి ఉంటారని డాక్టర్లు భావిస్తున్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్య సమాచారం తెలియజేస్తామని వారు పేర్కొన్నారు. కాగా, విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. కొన్ని నెలల క్రితం డెంగ్యూ నుండి కోలుకున్న విశాల్ మళ్లీ అస్వస్థతకు గురికావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అయితే, ఆయన టీమ్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు.

editor

Related Articles