కొన్ని సినిమాలు నటీనటుల మనస్తత్వాల్లో మార్పును తెస్తుంటాయి. ‘కేసరి 2’ సినిమా వల్ల నటి అనన్య పాండేకు అలానే జరిగిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనలో వచ్చిన మార్పు గురించి అనన్య మీడియాతో మాట్లాడింది. ‘కెరీర్ తొలినాళ్లలో ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలో తెలిసేది కాదు. అందులో కామెడీ, గ్లామర్ పాత్రలే ఎక్కువ. రీసెంట్‌గా ‘కేసరి 2’లో నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర చేశాను. ఆ పాత్రలో నన్నునేను చూసుకున్న తర్వాత నటిగా నాలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలిసొచ్చింది. ‘కేసరి 2’లో నేను చేసిన పాత్ర నాకొక సవాల్. నటిగా నా పొటెన్షియాలిటీని తెలియజెప్పిందా పాత్ర.
- May 12, 2025
0
68
Less than a minute
Tags:
You can share this post!
editor

