బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ బాలీవుడ్‌ను వదిలేసి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మకాం మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తున్నాడు. గతేడాది మహారాజ సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నాడు. అయితే అనురాగ్ తన కూతురు పెళ్లి విషయానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవైపు కూతురు పెళ్లి మరోవైపు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తనని విజయ్ సేతుపతి ఆదుకున్నాడని తెలిపాడు. తన కుమార్తె ఆలియా కశ్యప్ వివాహానికి అవసరమైన డబ్బు తన వద్ద లేదని ఈ విషయం విజయ్ సేతుపతికి చెప్పినప్పుడు ‘మేము సహాయం చేస్తాము’ అన్నారు. అలానే మహారాజా సినిమాలో విలన్ పాత్రలో నటించడానికి అవకాశం కూడా ఇచ్చారు. అలా ఉండేవి నా అర్థిక సమస్యలు. ఈ విషయంలో విజయ్ సేతుపతికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపాడు. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ‘మహారాజ’ సినిమా 2024 జూన్ 14న విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించగా, అనురాగ్ కశ్యప్ ఒక విలన్ పాత్రలో కనిపించారు.
- May 12, 2025
0
62
Less than a minute
Tags:
You can share this post!
editor

