‘సనమ్‌ తేరీ కసమ్‌’ సీక్వెల్‌ నుండి పాకిస్తాన్ హీరోయిన్‌ తొలగింపు..!

‘సనమ్‌ తేరీ కసమ్‌’ సీక్వెల్‌ నుండి పాకిస్తాన్ హీరోయిన్‌ తొలగింపు..!

పాకిస్తాన్‌ హీరోయిన్ మావ్రా హోకేన్‌ను సినిమా నుండి తొలగించారు. సూపర్‌ హిట్‌ సినిమా ‘సనమ్‌ తేరీ కసమ్‌’ సీక్వెల్‌ నుండి తొలగిస్తూ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్‌ సింధూర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సినిమా నుండి తొలగిస్తున్నట్లు దర్శకురాలు రాధికారావు, నిర్మాత వినయ్‌ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అన్నింటికంటే తమకు దేశమే ముఖ్యం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా ఏరకమైన ఉగ్రదాడిని ఖండించాల్సిందేనన్నారు. భారతీయ సినిమాల్లో నటించి ఎంతోమంది ప్రేమ, అభిమానాలు సంపాదించిన వారంతా ఉగ్రదాడిని ఖండించకపోవడం బాధాకరమన్నారు. ఉగ్రదాడిని ఎవరైనా సమర్థించడం హేయమైందని విమర్శించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌ తీసుకున్న నిర్ణయాలను విమర్శించే స్థాయికి వెళ్లడం దురదృష్టకరమన్నారు. తాము భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సనమ్‌ తేరీ కసమ్‌-2 సినిమాలో హీరోయిన్‌గా మావ్రా హోకేన్ ఉంటే తాను నటించేందుకు రెడీగా లేనని హీరో హర్షవర్ధన్‌ రాణే ప్రకటించారు. ఈ క్రమంలో ఆమెను సినిమా నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

editor

Related Articles