కొన్నాళ్లుగా పాకిస్తాన్ దుశ్చర్యలని భరిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు యుద్ధానికి దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 స్థావరాలపై దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులని మట్టుబెట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ భారత్‌పై యుద్ధానికి దిగింది. ఉగ్రవాదులపై దాడి చేస్తే.. పాక్ ఏకంగా యుద్ధానికి కాలు దువ్వుతూ.. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. సామాన్య పౌరుల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకొని దురుసుగా వ్యవహరిస్తోంది. ఫైటర్ జెట్లతో డ్రోన్లతో క్షిపణులతో భారత సైనిక స్థావరాలపై దాడి చేస్తోంది. వాటన్నింటిని భారత్ తిప్పికొడుతోంది. భారత్ దూకుడికి పాక్ కాస్త తలొగ్గినట్టు కనిపిస్తుంది. అమెరికా సహా పలుదేశాల నుండి పాక్‌పై ఒత్తిడి తేవడం, భారత్‌కు ప్రపంచదేశాల మద్దతు పెరుగుతుండడంతో పాక్ కాస్త వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో సామాన్య పౌరులు కూడా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైన ఉంది. భారత సైనిక దళాల కదలికలు ఎక్కడైనా గమనిస్తే, వాటిని ఫొటోలు తీయడం లేదా వీడియోలు చిత్రీకరించడం అస్సలు చేయవద్దని, అటువంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా, మనకు తెలియకుండానే శత్రువులకు సహాయం చేసినవారమవుతామని ప్రముఖులు హెచ్చరిస్తున్నారు.
- May 10, 2025
0
80
Less than a minute
Tags:
You can share this post!
editor

