ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు హీరో వెంకటేష్. ఈ సినిమా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా అనంతరం తన తదుపరి సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు వెంకీ. ఇప్పటికే పలు కథలు విన్న ఆయన, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. చాలా కాలంగా ఈ సినిమా గురించి చర్చలు జరుగుతుండగా, తాజాగా ఇది ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే వెంకటేష్‌తో కలిసి కథా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే, ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ సినిమాలకు ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభించింది. దీంతో, వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
- May 10, 2025
0
59
Less than a minute
Tags:
You can share this post!
editor

