భారత సైన్యానికి విజయ్‌ దేవరకొండ విరాళం

భారత సైన్యానికి విజయ్‌ దేవరకొండ విరాళం

నటుడిగా, హీరోగా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ సేవా, దాతృత్వ కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటారు హీరో విజయ్‌దేవరకొండ. కరోనాతో పాటు వివిధ విపత్తుల సమయంలో ఆయన ఆపన్నులకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఆపరేషన్‌ సింధూర్‌’ నేపథ్యంలో భారత సైన్యానికి విరాళం ప్రకటించారు విజయ్‌ దేవరకొండ. తన క్లాత్‌ బ్రాండ్‌ రౌడీవేర్‌ సేల్స్‌లో వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని ఇండియన్‌ ఆర్మీకి విరాళంగా ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా మాత్రమే కాదు.. మేడ్‌ ఫర్‌ ఇండియా’ అంటూ పోస్ట్‌ పెట్టారు విజయ్‌ దేవరకొండ.

editor

Related Articles