కోలీవుడ్ హీరో అజిత్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించి టాప్ హీరోగా ఎదిగాడు. మాస్ హీరోగా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. ఇటీవల పద్మ భూషణ్ అవార్డ్ కూడా అందుకున్నాడు అజిత్. స్వయంకృషితో ఎదిగి ఈ స్థాయికి వచ్చిన అజిత్ కోట్లాది మంది అభిమానుల ప్రేమని దక్కించుకున్నాడు. అజిత్ చదివింది పదో తరగతి కాగా, ఆయన నటుడిగా, రేసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అజిత్ గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అజిత్ కుమార్ మూలాలు అఖండ భారత దేశం నుంచి విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన దేశంలో ఉన్నాయట. అజిత్ తండ్రి పి సుబ్రహ్మణ్యన్ కేరళలోని పాలక్కాడ్ ప్రాంతానికి చెందినవారు. అజిత్ తల్లి మోహిని పాకిస్తాన్‌లోని కరాచీ ప్రాంతానికి చెందినవారు. అంటే సింధ్‌కు చెందిన సింధీ హిందూ. అంటే అతనికి సింధీ వారసత్వం ఉంది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుండి అనేకమంది హిందువులు భారత దేశానికి కాందిశీకులుగా తరలి వచ్చారు. తల్లి కుటుంబం అలానే తరలి వచ్చింది. అలా వచ్చిన అజిత్ అమ్మమ్మగారి ఫ్యామిలీ కోల్‌కతాకి వచ్చి స్థిరపడ్డారు. అయితే అజిత్ కుమార్ మాత్రం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ ప్రాంతంలో జన్మించారు.
- May 10, 2025
0
68
Less than a minute
Tags:
You can share this post!
editor

