నాని-సుజీత్ సినిమాకి లైన్ క్లియ‌ర్.. టైటిల్ ఫిక్స్ అయిందా?

నాని-సుజీత్ సినిమాకి లైన్ క్లియ‌ర్.. టైటిల్ ఫిక్స్ అయిందా?

హీరో నాని వ‌రుస సక్సెస్‌ల‌తో దూసుకుపోతున్నాడు. ఆయ‌న నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన కోర్టు సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక న‌టుడిగా హిట్ 3తో పెద్ద స‌క్సెస్ సాధించాడు. ఇక ఇప్పుడు ది ప్యార‌డైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పెద్ద హిట్ కొడ‌తాడ‌ని భావిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. రియలిస్టిక్ డ్రామాగా ఈ సినిమాతో స‌రికొత్త చ‌రిత్ర సృష్టిస్తాడ‌ని అంటున్నారు. అయితే లైన‌ప్ చాలా పెద్ద‌గానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. నానీకి చాలాకాలం క్రితమే సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే సుజిత్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఓజీ చేస్తుండ‌గా, ఈ ప్రాజెక్ట్ చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉంది. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటంతో మధ్యలో షూటింగ్ నిలిచినా, రీసెంట్‌గా ఆయన డేట్స్ ఇచ్చి మరల సెట్స్ పైకి వచ్చారు. ఓజీ వచ్చే ఆగస్టు-సెప్టెంబర్‌లో విడుదల కానుంద‌ని తెలుస్తోంది. ఆ త‌ర్వాత సుజీత్ పూర్తి స్థాయిలో నాని సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు. నాని రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా 2027లో రిలీజ్ అవుతుందని చెప్ప‌డం మ‌నం చూశాం. ఈ సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని ఇప్పటికే ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

editor

Related Articles