హాలీవుడ్ హర్రర్ సినిమాల సిరీస్‌లో ది కంజురింగ్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుండి 8 సినిమాలు రాగా.. సూపర్ హిట్‌ను అందుకున్నాయి. అయితే తాజాగా ఈ ఫ్రాంచైజీ నుండి మరో సినిమా రాబోతోంది. ది కంజురింగ్: లాస్ట్ రైట్స్ అంటూ ఈ సినిమా రాబోతుండగా.. తాజాగా టీజర్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. 2021లో విడుదలైన “ది కంజురింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్”కు ఇది సీక్వెల్‌గా వస్తోంది. టీజర్ చూస్తుంటే.. పారానార్మల్ పరిశోధకులు ఎడ్, లోరైన్ వారెన్ తమ చివరి కేసును చేపట్టినట్లు చూపించారు. ఈ కేసు వారి జీవితంలో ఎందుకు కీలకమైనదో టీజర్‌లోని హర్రర్ దృశ్యాలను సూచిస్తున్నాయి. ఈ సినిమాలో పాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా మరోసారి ఎడ్, లోరైన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు బెన్ హార్డి, మియా టాంలిన్సన్, టోనీ స్పెరా, స్టీవ్ కౌల్టర్, రెబెకా కాల్డర్, ఎలియట్ కౌవాన్, కిలా లార్డ్ కాసిడి, బ్యూ గాడ్సన్, జాన్ బ్రదర్‌టన్, షానన్ కూక్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. “ది కంజురింగ్: లాస్ట్ రైట్స్” వచ్చే ఏడాది సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- May 9, 2025
0
72
Less than a minute
Tags:
You can share this post!
editor

