హర్రర్‌ సినిమాతో హాలీవుడ్‌లోకి కంగనా రనౌత్ ఎంట్రీ

హర్రర్‌ సినిమాతో హాలీవుడ్‌లోకి కంగనా రనౌత్ ఎంట్రీ

హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నది కంగనా రనౌత్‌. ఓ హర్రర్‌ ఫిల్మ్‌లో ఆమె నటిస్తోంది. బ్లెస్డ్‌ బీ ద ఈవిల్‌ సినిమాలో కంగనా నటిస్తోంది. తనూ వెడ్స్‌ మనూ, ఫ్యాషన్‌, క్వీన్‌, తలైవీ లాంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్‌ క్వీన్‌ ఇప్పుడు హాలీవుడ్‌లో తన పర్ఫార్మెన్స్‌ ఇవ్వనున్నది. స్కార్లెట్‌ రోజ స్టాలోన్‌తో కలిసి కంగనా ఆ సినిమాలో తన పాత్రను పోషించనున్నది. యాక్షన్‌ హీరో సూపర్ స్టార్‌ సిల్వస్టర్‌ స్టాలోన్‌ కుమార్తె స్కార్లెట్‌ రోజ్‌ స్టాలోన్‌. ఈ ఫిల్మ్‌లో టీన్‌ వోల్ఫ్‌ నటుడు టైలర్‌ పోసే కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి అనురాగ్‌ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రీన్‌ ప్లే గాథ తివారీ. ఈ సినిమాని ఇద్దరు కలిసి ప్రొడ్యూస్‌ చేయనున్నారు. హర్రర్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి ఈ వేసవిలోనే షూటింగ్‌ మొదలెట్టనున్నారు. విదేశీ సినిమాలపై 100 శాతం పన్ను వసూల్‌ చేయనున్నట్లు ట్రంప్‌ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమాని అమెరికాలోనే షూట్‌ చేయనున్నారు.

editor

Related Articles