పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించిన అవైటెడ్ సినిమా “హరిహర వీరమల్లు”. ఎన్నో అంచనాల మధ్య సెట్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్‌గా రిలీజ్‌కి వస్తుండగా ఆ రిలీజ్ డేట్ క్లారిటీ కోసం ఇపుడు పవన్ అభిమానులు ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే పలు మార్లు విడుదల తేదీలు పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. ఇలా ఈ మే 9 నుండి షిఫ్ట్ అయిన ఈ సినిమా కొత్త డేట్ ఏంటి అనే సస్పెన్స్ ఇపుడు నెలకొనగా లేటెస్ట్గా బుక్ మై షో అయితే కొత్త డేట్‌ని లీక్ చేసింది. ఇందులో జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా బిగ్ స్క్రీన్స్‌లో పడనున్నట్టుగా పొందుపరిచారు. దీంతో వీరమల్లు ఆగమనం ఆరోజు నుండి ఉంటుంది అని అనధికారికంగా లీక్ అయ్యింది. ఇక దీనిపై మేకర్స్ అధికారిక క్లారిటీ ఏమన్నా ఇస్తారేమో అని వేచిచూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
- May 8, 2025
0
75
Less than a minute
Tags:
You can share this post!
editor

