తండ్రి కాబోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం..

తండ్రి కాబోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం..

హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాతోనే తెలుగు తెరకు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రహస్య గోరఖ్. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఆ త‌ర్వాత రిలేష‌న్ పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఇటీవ‌లి కాలంలో క సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ జోష్‌లో మ‌రిన్ని సినిమాల‌ని లైన్‌లో పెట్టాడు. అయితే కొన్నాళ్ల క్రితం ఓ గుడ్ న్యూస్‌ని షేర్ చేసుకున్నారు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. తాము త్వ‌ర‌లో తల్లిదండ్రులం కాబోతున్న‌ట్టు తెలియజేశారు. తాజాగా కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరఖ్ సీమంతం వేడుక ఘనంగా జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కొన్ని ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేశారు రహస్య. అందులో బేబీ బంప్, కిరణ్ అబ్బవరంతో కలిసిన ఫొటోస్ ఉన్నాయి.

editor

Related Articles