ఆప‌రేష‌న్ సింధూర్‌పై.. సెల‌బ్రిటీలు స్పందన..!

ఆప‌రేష‌న్ సింధూర్‌పై.. సెల‌బ్రిటీలు స్పందన..!

పహల్గాం దాడికి ప్ర‌తీకారంగా భార‌త్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. తాజాగా ఆప‌రేష‌న్ సింధూర్ పేరిట పాకిస్తాన్‌కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్‌తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొన్నారు. పహల్గామ్‌ దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి, ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచేసిన కారణంగానే ఈ ఆపరేషన్‌కు ‘సింధూర్‌’ అని నామకరణం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ, ఇండియా ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేప‌ట్ట‌గా దీనికి ప‌లువురు సినీ, రాజ‌కీయ‌, పారిశ్రామికవేత్తలు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. భారత సైన్యం విజయవంతంగా ‘ఆపరేషన్ సింధూర్‌’ ను అమలు చేసినట్టు వార్త‌లు వచ్చిన వెంట‌నే బాలీవుడ్ సినీ ప్రముఖులు భారత రక్షణ దళాల వీరోచిత చర్యను అభినందిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. నటుడు రితేష్ దేష్‌ముఖ్, దర్శకుడు మధుర్ భండార్క‌ర్ ఆపరేషన్ సింధూర్‌పై స్పందించారు. మధుర్ భండార్కర్ కూడా స్పందిస్తూ, “మన దళాల కోసం ప్రార్థనలు చేద్దాం. ఒకే దేశం, మనమంతా ఒక్కటిగా ముందుకు సాగుదాం. జై హింద్, వందేమాతరం అంటూ ఆయ‌న రాసుకొచ్చారు. ఇక నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఆపరేషన్ సింధూర్‌పై స్పందించారు. ‘భారత్ మాతా కీ జై’ అని పోస్ట్ చేశారు. భార‌త్ మాతా కి జై న్యాయం జ‌రిగింది అని ఖుష్బూ అన్నారు. మా ప్రార్ధ‌న‌ల‌న్నీ కూడా బ‌ల‌గాల‌తోనే ఉంటాయి. క‌లిసి ముందుకు సాగుదాం అంటూ ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు. యూనియన్ మంత్రులు కిరణ్ రిజిజు, బండి సంజయ్ కుమార్ కూడా సైన్యాన్ని అభినందించారు.

editor

Related Articles