అమ్మానాన్నలు కాబోతున్న వరుణ్, లావణ్య..!

అమ్మానాన్నలు కాబోతున్న వరుణ్, లావణ్య..!

హీరో వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య, నటి లావణ్య త్రిపాఠి గర్భవతి అని త్వ‌ర‌లోనే తాము త‌ల్లిదండ్రులు కాబోతున్న‌ట్లు ఈ దంప‌తులు నేడు ఇన్‌స్టా వేదిక‌గా అధికారికంగా ప్రకటించారు. జీవితంలోనే అత్యంత అందమైన పాత్రలోకి అడుగుపెట్టబోతున్నాం – త్వరలో రాబోతోంది  అంటూ చేతులు పట్టుకుని ఉన్న ఒక అందమైన ఫొటోను, రెండు చిన్న వైట్‌ బూట్ల ఫొటోను వారు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటో వైర‌ల్‌గా మారింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2023 నవంబర్‌లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు వారు తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధమవుతున్నారు. ఈ శుభవార్తతో చిరంజీవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

editor

Related Articles