అమీర్‌ఖాన్ ‘సితారే జమీన్ పర్‌’ ఫస్ట్ లుక్ రిలీజ్

అమీర్‌ఖాన్ ‘సితారే జమీన్ పర్‌’ ఫస్ట్ లుక్ రిలీజ్

అమీర్‌ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘సితారే జమీన్ పర్‌’ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకి ‘సబ్‌ కా అప్న అప్న నార్మల్‌’ అనేది ఉపశీర్షిక. ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమీర్‌ఖాన్  ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో ఆరోష్‌ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్‌ దేశాయ్, వేదాంత్‌ శర్మ, ఆయుష్‌ భన్సాలీ, ఆశిష్‌ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరందరూ ‘సితారే జమీన్ పర్‌’ సినిమాతోనే వెండితెరకు పరిచయం కావడం విశేషం. అమీర్‌ఖాన్  నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సూపర్ హిట్ సినిమా ‘తారే జమీన్ పర్‌’ (2007) సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోందని అమీర్‌ఖాన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. అయితే ఈ సినిమా కామెడీ ఆధారంగా రాబోతోంద‌ని స‌మాచారం. దాదాపు మూడేళ్ల తర్వాత అమీర్‌ఖాన్  నుండి వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

editor

Related Articles