అనారోగ్యంతో మంచం ప‌ట్టిన మ‌రో బ‌ల‌గం న‌టుడు..

అనారోగ్యంతో మంచం ప‌ట్టిన మ‌రో బ‌ల‌గం న‌టుడు..

జ‌బ‌ర్ధ‌స్త్ ఫేమ్ వేణు ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించిన సినిమా బ‌ల‌గం. చిన్న సినిమాగా విడుద‌లై ఈ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక్క‌డ బ‌ల‌గం సినిమాలో నటించిన మరో నటుడు అనారోగ్యంతో మంచం పట్టాడు. ఈ సినిమాలో కొమురయ్య తమ్ముడు అంజన్న పాత్రలో నటించిన జీవీ బాబు ప్ర‌స్తుతం అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నాడు. చాలాకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండ‌గా, ప్రస్తుతం హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు బాబు కనీసం వైద్యఖర్చులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మందులు కొన‌డానికి కూడా డ‌బ్బులు లేని ప‌రిస్థితిలో ఉన్నాడ‌ట‌. అయితే జీవీ బాబు ఫ్యామిలీ వారి స్థోమతకు తగ్గట్టుగా డబ్బులు కూడబెట్టి వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అతనికి డయాలసిస్‌ చేయిస్తున్నారు.

editor

Related Articles