రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ఉపేంద్ర..

రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ఉపేంద్ర..

ఈ వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందడంతో ఉపేంద్ర స్వయంగా స్పందించారు. త‌న ఎక్స్ ఖాతాలో స్పష్టతనిచ్చిన ఉపేంద్ర, ‘అందరికీ నమస్కారం.. నేను ఆరోగ్యంగా ఉన్నాను.. రెగ్యులర్ చెకప్ కోసం మాత్ర‌మే నేను ఆసుపత్రికి వెళ్ళాను అంతే త‌ప్ప‌.. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు విని అభిమానులు ఏ మాత్రం ఆందోళన చెంద‌వ‌ద్దు. మీ ప్రేమ‌, అభిమానానికి నా ధ‌న్య‌వాదాలు అంటూ ఉపేంద్ర త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఉపేంద్ర క్లారిటీతో గాలి వార్త‌ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టు అయింది. అయితే త‌మ అభిమాన న‌టుడు ఆరోగ్యంగానే ఉన్నార‌ని తెలిసి అభిమానులు కాస్త సంతోషంగానే ఉన్నా, ఆయన సడెన్ గా ఆసుపత్రికి ఎందుకు వెళ్లారనే దానిపై ప‌లు ఆలోచ‌న‌లు ఫ్యాన్స్‌లో కలిగాయి. న‌టుడు ఉపేంద్ర తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఆయ‌న న‌టించిన చాలా సినిమాలు తెలుగులో కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఉపేంద్ర‌కి 56 ఏళ్ళు కాగా, ఆయ‌న ఎసిడిటీ సమస్యతో వెళ్లి ఉంటార‌ని అనుకుంటున్నారు. గ‌తంలో యూఐ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఎసిడిటీ సమస్యతో బాధపడ్డారు. ఎక్కువ సేపు షూటింగ్, పని ఒత్తిడి, తినే అలవాట్లలో మార్పులు వ‌ల‌న ఎసిడిటీ వ‌చ్చి ఉండ‌వ‌చ్చు అని అంచ‌నా కొచ్చిన ఫ్యాన్స్.

editor

Related Articles