మన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న భారీ సినిమా ‘కింగ్‌డమ్’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండి మంచి హైప్ నెలకొనగా సినిమా మధ్యలో కొంచెం ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పుడు సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ మాత్రం అదరగొట్టింది అని చెప్పాలి. అనిరుధ్ ఇచ్చిన సంగీతం దర్శకుడు టేకింగ్ ఆడియెన్స్‌లో సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెంచాయి. దీంతో ఇప్పుడు కింగ్‌డమ్‌పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి అని చెప్పాలి. ఇక ఇదే పాజిటివ్ వైబ్స్ కొనసాగితే మాత్రం కింగ్‌డమ్‌తో విజయ్ కూడా భారీ ఓపెనింగ్స్ అందుకోవచ్చని చెప్పాలి. ఇక ఈ సినిమాని సితార సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ మే 30న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్‌కి సిద్ధమౌతోంది.
- May 3, 2025
0
65
Less than a minute
Tags:
You can share this post!
editor

