జనాల మధ్యకి హీరోయిన్స్ రావాలంటే భయపడిపోతున్నారు. ఎవరు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తారో అని టెన్షన్ పడుతుంటారు. అయినా కొన్నిసార్లు తప్పని పరిస్థితులలో బయటకు రావల్సిన పరిస్థితి. ఆ సమయంలో కొందరు ఆకతాయిలు అత్యుత్సాహం చూపిస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మలయాళ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్. ఈ మలయాళ బ్యూటీ తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్లింది. ఆమె వస్తుందని తెలిసి జనం పెద్ద సంఖ్యలో ఆ షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చారు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత మంజు వారియర్ తిరిగి వెళ్లేందుకు తన కారు దగ్గరకు వచ్చింది. ఇక ఆ సమయంలో జనాలు తనని చుట్టు ముట్టడంతో వారందరికి అభివాదం చేసింది. కొందరు ఆమెకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే సందట్లో సడేమియా అన్నట్టు ఓ వ్యక్తి చేత్తో ఆమె నడుమును టచ్ చేశాడు. మంజు వారియర్ పట్టించుకోలేదు. కొంతమందితో సెల్ఫీలు దిగి అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, మంజూతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు.
- May 3, 2025
0
59
Less than a minute
Tags:
You can share this post!
editor

