మళ్ళీ విజయ్ సినిమాకు పవన్ సినిమా దెబ్బ!

మళ్ళీ విజయ్ సినిమాకు పవన్ సినిమా దెబ్బ!

పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణతో చేస్తున్న భారీ సినిమా “హరిహర వీరమల్లు” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇలా గత మార్చ్ 28 నుండి ఈ మే 9కి వాయిదా పడ్డ ఈ సినిమా మళ్ళీ ఈ మే 9 నుంచి నెలాఖరుకు వాయిదా పడినట్టుగా టాక్ నడుస్తోంది. ఇక ఇదిలా ఉండగా మళ్ళీ ఈ వాయిదాతో ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ భారీ సినిమా “కింగ్‌డమ్” పైనే పడినట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ హరిహర వీరమల్లు గాని మే చివరికి ఫిక్స్ అయితే కింగ్‌డమ్ వాయిదా పడే ఛాన్స్ ఉందట. దీనితో కింగ్‌డమ్  ఫేట్ వీరమల్లుపై ఆధారపడి ఉందని చెప్పాలి. అయితే పవన్ నుండి డేట్స్ ఇంకా రాకపోవడంతో బాలన్స్ షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.

editor

Related Articles