హైదరాబాద్‌ జోష్‌ ‘దేత్తడి’

హైదరాబాద్‌  జోష్‌  ‘దేత్తడి’

 నిర్మాత దిల్‌రాజు తెరకెక్కిస్తున్న 60వ సినిమాకి ‘దేత్తడి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆశిష్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ఆదిత్య రావు గంగసాని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గురువారం హీరో ఆశిష్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘హైదరాబాద్‌ నేపథ్య కథాంశమిది. ఇక్కడి యువత తాలూకు జోష్‌, వారిదైన ప్రత్యేక కల్చర్‌ను ఆవిష్కరిస్తుంది. ఆద్యంతం చక్కటి వినోదంతో పాటు హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో హీరో ఆశిష్‌ డప్పు వాద్యకారుడి గెటప్‌లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకి నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్‌, దర్శకత్వం: ఆదిత్యరావు గంగసాని.

editor

Related Articles