మిథున్‌, అమితాబ్‌, కమల్‌హాసన్‌ ఈ ముగ్గురూ నాకు ప్రేరణ..

మిథున్‌, అమితాబ్‌, కమల్‌హాసన్‌ ఈ ముగ్గురూ నాకు ప్రేరణ..

చిరంజీవిని ప్రేరణగా తీసుకుని నటులైన వాళ్లు టాలీవుడ్‌లో కోకొల్లలు. ఎందరినో తన నటన, డ్యాన్సుల ద్వారా ప్రభావితం చేశారు చిరంజీవి. మరి అలాంటి మెగాస్టార్‌ని కూడా ఓ ముగ్గురు ఓ రేంజ్‌లో ప్రభావితం చేశారట. నటుడిగా చిరంజీవిపై వారి ప్రభావం ఎంతో ఉందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ముంబయ్‌ వేదికగా గురువారం జరిగిన ‘వేవ్స్‌’ లో పాల్గొన్న చిరంజీవి.. తన సినీ ప్రయాణంలో తనని ఇన్‌స్పైర్‌ చేసిన వారిని గుర్తు చేసుకున్నారు. ‘చిన్నప్పట్నుంచే డ్యాన్సులు చేస్తూ ఇంట్లో వాళ్లని, ఫ్రెండ్స్‌ని అలరించేవాణ్ణి. వారంతా మెచ్చుకుంటుంటే ఏదో తెలియని కిక్‌. ఆ కిక్కే నన్ను నటన వైపు నడిపించింది. దాంతో చెన్నై రైలెక్కాను. నేను చెన్నైలో అడుగుపెట్టిన టైమ్‌లో మహామహులు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ‘ఇంతమంది సూపర్‌స్టార్లు ఉన్నారు కదా.. నేను కొత్తగా ఏం చేయగలను?’ అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. 1977లో నటశిక్షణ పూర్తయింది. మేకప్‌ లేకుండా సహజంగా నటించే విషయంలో మిథున్‌ చక్రవర్తి.. స్టంట్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌ చేసే విషయంలో అమితాబ్‌.. డ్యాన్స్‌ విషయంలో కమల్‌హాసన్‌.. ఈ ముగ్గురూ నాకు ప్రేరణగా నిలిచారు. వారి సినిమాలు చూస్తూ, నటనను పరిశీలిస్తూ నన్ను నేను మలచుకున్నా’ అని చిరంజీవి చెప్పారు. రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

editor

Related Articles