మహేష్, రాజమౌళి భారీ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.!

మహేష్, రాజమౌళి భారీ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.!

మన టాలీవుడ్ హీరో మహేష్ బాబు అలాగే ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కిస్తున్న భారీ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఒక్క పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమాపై అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ని రాజమౌళి లేటుగానే స్టార్ట్ చేసినప్పటికీ శరవేగంగానే పూర్తి చేస్తున్నారు. ఇలా లేటెస్ట్‌గా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇప్పుడు తెలుస్తోంది. జక్కన్న ప్రస్తుతం మహేష్, ప్రియాంక చోప్రాపై ఓ గ్రాండ్ సాంగ్‌ని తెరకెక్కిస్తున్నారట. ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కాగానే మేకర్స్ కొన్నిరోజులు బ్రేక్ తీసుకోనున్నారట. ఇక ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ టాకీ పార్ట్‌తో సినిమా మొదలు కానున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మహేష్ ఈ కొంచెం గ్యాప్‌లో కూడా ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

editor

Related Articles