స్వీయ దర్శకత్వంలో పూర్వాజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కిల్లర్’. థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్‌ఆర్, ఏయు అండ్ ఐ పతాకాలపై పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. త్వరలో విడుదలకానుంది. బుధవారం ఈ సినిమా గ్లింప్స్‌ను తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేశారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎలిమెంట్స్‌తో గ్లింప్స్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇందులో ప్రాచీన వైమానిక శాస్త్రంలో ఆశ్చర్యపరిచే మానవ మేధస్సు రహస్యాలను వెల్లడించారు. ఆత్మ కలిగిన యంత్రాలను చూస్తారంటూ వైమానిక శాస్త్రంలో చెప్పిందే నిజం కాబోతుందా అనే ప్రశ్నతో గ్లింప్స్ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ బొమ్మిశెట్టి, సంగీతం: ఆశీర్వాద్, సుమన్ జీవ, రచన – దర్శకత్వం: పూర్వాజ్.
- May 1, 2025
0
66
Less than a minute
Tags:
You can share this post!
editor

