డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించిన మోక్ష‌జ్ఞ‌..!

డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించిన మోక్ష‌జ్ఞ‌..!

నంద‌మూరి బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ డెబ్యూ కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అదిగో వ‌స్తున్నాడు, ఇదిగో వ‌స్తున్నాడు అంటున్నారే త‌ప్ప మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమా గురించి పూర్తి క్లారిటీ రావ‌డం లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ సినిమాను అనౌన్స్ చేసిన త‌ర్వాత‌ ఈ సినిమా షూటింగ్ ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆగిపోయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ ప్రాజెక్ట్ నుండి ప్ర‌శాంత్ వ‌ర్మ తప్పుకున్నాడ‌ని, అందుకే ఇది ఆగింద‌ని కూడా ప్ర‌చారం జరిగింది. ఆ త‌ర్వాత మోక్షజ్ఞ కోసం డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ మంచి కథను రెడీ చేశారని, ఈ కథ బాలయ్య కూడా విన్నారని.. దాంతో వెంకీతో మోక్షజ్ఞ సినిమా ఫిక్స్ అయినట్టు ఫిలిం న‌గ‌ర్‌లో ప్ర‌చారాలు సాగాయి. మ‌రోవైపు బాలయ్య సూపర్ హిట్ సినిమా ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ.. హీరోగా ఎంట్రీ ఇస్తారని అప్పట్లో ప్ర‌చారం జ‌రిగింది. క‌ట్ చేస్తే రీసెంట్‌గా ఢిల్లీలో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు సందర్భంగా మోక్షజ్ఞ త‌న ఫ్యామిలీతో క‌లిసి ఫొటోలు దిగారు. అందులో మోక్ష‌జ్ఞ లుక్ చాలా డిఫ‌రెంట్‌గా క‌నిపించింది. ప్రశాంత్ వర్మ సినిమా కోసం విడుదలైన పోస్టర్లలో మోక్షజ్ఞ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. కాని ఇప్పుడు ఈ ఫొటోలో చూస్తే ఏదో తేడా కొడుతోంది.

editor

Related Articles