ప్రతి సినిమాకి చాలా గ్యాప్ తీసుకుని సినిమాలు చేసే శేఖర్ కమ్ముల ఇప్పుడు ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో ‘కుబేర’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్‌రావు నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా కుబేర సినిమా నుండి మొదటి పాటని రిలీజ్ చేశారు. పోయిరా మామ.. అంటూ సాగే ఈ పాట శ్రోతలని ఎంతగానో అలరిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన సాంగ్‌కి భాస్కరభట్ల సాహిత్యం అందించగా, హీరో ధనుష్ స్వయంగా పాడాడు. ఈ పాటలో ధనుష్ మాస్ స్టెప్స్ కూడా అదరగొట్టారు. ‘పోయిరా మావా..’ సాంగ్ విడుదల సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాస్ స్టెప్పులు వేసి ప్రేక్షకుల్లో జోష్ నింపారు. గతంలో ఎప్పుడు కూడా శేఖర్ కమ్ముల డ్యాన్స్ వేసిన సందర్భాలు లేవు. ఇక ధనుష్ హీరోగా రూపొందుతున్న కుబేర సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ మాస్ బీట్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. శేఖర్ వి.జె అందించిన కొరియోగ్రఫీ పాటను ఒక విజువల్ ట్రీట్‌గా మలిచింది అని చెప్పాలి.
- April 21, 2025
0
87
Less than a minute
Tags:
You can share this post!
editor

