మంచు మోహన్‌బాబు కుటుంబం మళ్లీ మళ్లీ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. విష్ణు – మనోజ్ మధ్య వివాదం ఇంకా రగులుతూనే ఉంది. మంచు ఫ్యామిలిలో అసలేం జరుగుతోంది?, నిజంగానే తన కుటుంబంలో గొడవలు కారణంగా మనోజ్ ఇబ్బంది పడుతున్నాడా? అంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే, ఆస్తుల పంపకం విషయంలోనే అసలు సమస్య ప్రారంభమైందని టాక్ మరోవైపు వినిపిస్తున్నా.. అది కాదు అంటూ మనోజ్ క్లారిటీ ఇస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనలు అందించాలనే లక్ష్యంతో మంచులక్ష్మి నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమం ‘టీచ్ ఫర్ ఛేంజ్’. నిన్న రాత్రి జరిగిన ఈవెంట్లో తన సోదరిని సర్ప్రైజ్ చేస్తూ మనోజ్ అక్కడికి వెళ్ళాడు. మనోజ్‌ను చూసిన వెంటనే లక్ష్మి ఎమోషనల్ అయ్యారు. ఆయన్ని ప్రేమగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు.
- April 14, 2025
0
200
Less than a minute
Tags:
You can share this post!
administrator

