ప్రభాస్‌ సినిమాలో విలన్‌గా మమ్ముట్టి

ప్రభాస్‌ సినిమాలో విలన్‌గా మమ్ముట్టి

ప్రభాస్‌తో సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్‌’ సినిమా మెయిన్‌ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందట. ఇప్పటివరకూ ఇండియన్‌ స్క్రీన్‌పై ఈ తరహా కథ రాలేదని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘కాప్‌ స్టోరీలు ఇప్పటివరకూ ఇండియన్‌ స్క్రీన్‌పై కొన్ని వందలు వచ్చుంటాయి. కానీ.. ఈ తరహా కాప్‌ని మాత్రం ఇండియన్‌ ఆడియన్‌ కచ్చితంగా చూసుండడు. ఇది ఒక కథకునిగా చెబుతున్న మాట.’ అని సందీప్‌రెడ్డి వంగా తెలిపారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ పనుల్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు సందీప్‌రెడ్డి వంగా. ఓ వైపు ఇప్పటికే హర్షవర్దన్‌ రామేశ్వర్‌తో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా పూర్తి చేశారు. స్క్రిప్ట్‌ వర్క్‌ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం నటీనటుల వేటలో ఉన్నారు సందీప్‌రెడ్డి. ఇందులో కొరియన్‌, అమెరికన్‌ యాక్టర్స్‌ కూడా నటించనున్నట్టు తెలుస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారట. ఆయన పాత్ర నెక్ట్స్‌ లెవల్లో ఉంటుందని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్ధంలో షూటింగ్‌ మొదలు కానుంది. టి-సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

editor

Related Articles