దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్‌రోషన్‌తో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ చేతులు కలపడంతో సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాని తీస్తున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్. అగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల చేయనున్నారు. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గతంలో సల్మాన్, హృతిక్, షారుఖ్‌లు రా ఏజెంట్లుగా నటించి మెప్పించారు. వారి పాత్రలకు పూర్తి భిన్నంగా ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేశారట అయాన్ ముఖర్జీ. అంతేకాక హృతిక్‌తో ఢీ అంటే ఢీ అనేలా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. హృతిక్, ఎన్టీఆర్‌లపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ పాటలో ఈ ఇద్దరు హీరోలతో పాటు 500 మంది డాన్సర్లు కూడా పాల్గొన్నారట. ప్రీతమ్ స్వరపరిచిన ఈ పాటకు బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించినట్టు సమాచారం. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదిలావుంటే. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న హృతిక్ ‘వార్ 2’తోపాటు ఎన్టీఆర్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ‘వార్ 2’ నా కెరీర్‌లోనే సులభంగా పూర్తయిన సినిమా. షూటింగ్‌ని పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ క్రెడిట్ అయాన్ ముఖర్జీదే. ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. అతని ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. తనకెప్పుడూ రుణపడి ఉంటా. ‘వార్’తో పోల్చుకుంటే ‘వార్2’ అన్ని విధాలా బావుంటుంది. ఈ సినిమాలో నటించినందుకు గర్వంగా ఉంది.’ అంటూ చెప్పుకొచ్చారు హృతిక్ రోషన్.

- April 14, 2025
0
6
Less than a minute
Tags:
You can share this post!
editor