పుష్ప ది రూల్ సినిమాతో నేషన్ వైడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు సుకుమార్. అయితే ఈ ప్రాజెక్ట్ అనంతరం సుకుమార్ ఎవరితో సినిమా చేయబోతున్నాడా అని సినిమా లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సినీ వర్గాల ప్రకారం సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ చరణ్‌తో ‘RC 17’ చేస్తాడని అంటుండగా.. మరోవైపు ‘పుష్ప 3’ కథ రాసే పనిలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదిలావుంటే.. ఈ రెండు కాకుండా మరో క్రేజీ పాన్ ఇండియా కాంబో తెరమీదకు వచ్చింది. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్, దర్శకుడు సుకుమార్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్‌ను విలన్ పాత్రలో చూపించే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
											- March 18, 2025
 
				
										 0
															 49  
															  Less than a minute 
										
				
			
				Tags:			
		You can share this post!
editor
				
