రూ.100 కోట్లతో ఖరీదైన భవనం నయనతార సొంతం..

రూ.100 కోట్లతో ఖరీదైన భవనం నయనతార సొంతం..

ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించింది హీరోయిన్ నయనతార. ప్రస్తుతానికైతే కుటుంబం కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్‌ సినిమాల్లో నయనతార భాగమైంది. ముఖ్యంగా మహిళా ప్రధాన కథాంశాలతో ప్రేక్షకులకు చేరువైంది. ఈ క్రమంలో తన సమకాలీన హీరోయిన్ల కంటే నయనతార భారీ మొత్తంలో డబ్బును ఆర్జించిందని చెబుతారు. తాజాగా ఆమె 100 కోట్లతో చెన్నైలో ఓ విలాసవంతమైన గృహాన్ని కొనుగోలు చేసింది. చెన్నైలో ప్రముఖులు ఉండే పోయెస్‌ గార్డెన్‌లో భర్త విఘ్నేష్‌ శివన్‌తో కలిసి ఆమె ఈ ప్రాపర్టీ కొనుగోలు చేసిందని తెలిసింది. దాదాపు మూడంతస్తులు ఉన్న ఈ భవనంలో మొదటి ఫ్లోర్‌ మొత్తం స్టూడియో కోసం కేటాయించారట. మిగతా రెండు ఫ్లోర్‌లలో అధునాతన సౌకర్యాలతో విలాసవంతంగా ఇంటిని సిద్ధం చేశారట. ఇంటీరియర్‌ డిజైన్స్‌కే పెద్ద మొత్తంలో వెచ్చించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

editor

Related Articles