డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ప్రస్తుతం SSMB 29 అనే సినిమా స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్‌గా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఒడిశాలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుండగా, అక్కడ షూటింగ్ ప్రారంభించిన మొదటి రోజే ఓ వీడియో లీక్ అయింది. జక్కన్న తీసిన సీన్స్ అన్ని లీక్ కావడంతో ఆయన షూటింగ్‌లో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇందులో ప్రియాంక చోప్రా ముఖ్య పాత్ర పోషిస్తుండగా, ఆమెని నెగెటివ్‌గా జక్కన్న చూపించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారిక ప్రకటన రాని నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. రాజమౌళి సినిమా అంటే ట్విస్ట్‌లు మాములుగా ఉండవు. ఏది చేసిన కూడా అది సంచలనమే అవుతుంది. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తలలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపూట్ జిల్లాలో జరుగుతోంది.

- March 18, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor