మన టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి హీరోస్‌లో రామ్ పోతినేని కూడా ఒకరు. మరి రామ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నిర్మాతలు శరవేగంగా ఈ సినిమాని ఏపీలో పలు లొకేషన్స్‌లో షూటింగ్ పనిలో ఉన్నారు. అయితే హీరో రామ్ మంచి టాలెంట్ కలిగిన హీరో, మన తెలుగు సినిమా దగ్గర క్రేజీ డాన్స్ మూమెంట్స్ చేసే అతి తక్కువమంది హీరోస్‌లో తాను కూడా ఒకరు అని తెలిసిందే. అయితే తనలోని మరో టాలెంట్‌ని ఇపుడు పరిచయం చేయబోతున్నారట. ఇపుడు నటిస్తున్న సినిమా కోసమే తాను ఒక లవ్ సాంగ్‌ని రాసినట్టుగా తెలుస్తోంది. దీంతో తాను రాసిన పాట తన ఫ్యాన్స్ కూడా వినబోతున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి వివేక్, మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు.
- February 27, 2025
0
211
Less than a minute
Tags:
You can share this post!
administrator

