ఇప్పటికీ లవ్‌ జిహాద్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నా: ప్రియమణి

ఇప్పటికీ లవ్‌ జిహాద్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నా: ప్రియమణి

సినీ ఇండస్ట్రీలోకి వచ్చి సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది హీరోయిన్ ప్రియమణి. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ ప్రియమణికి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆమె సినిమాలు, సిరీస్‌, టీవీ ప్రోగ్రామ్స్‌తో బిజీ బిజీగా మారిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. పెళ్లి అనంతరం ఎదురైన అనుభవాలను పంచుకుంది. మతాంతర వివాహం కారణంగా తాను లవ్‌ జిహాద్‌ ఆరోపణలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. తనకు పుట్టబోయే బిడ్డల గురించి కూడా అనవసరంగా కామెంట్స్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ముస్తఫా రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2016లో వీరి నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగిన నాటి నుండి తనపై విమర్శలు ఎక్కువయ్యాయని ప్రియమణి తెలిపింది. ‘ఎనిమిదేళ్ల క్రితం మా వివాహం అయ్యింది. ఇప్పటికీ మా పెళ్లి విషయంలో ట్రోల్స్‌ వస్తూనే ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు ప్లీజ్…

editor

Related Articles