పుష్పా 2 నిర్మాత నవీన్ బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి మైత్రి మూవీస్ ఆర్థిక సాయం ప్రకటించింది. బాధిత కుటుంబాన్ని సోమవారం కలిసి ఆయన చెక్కును అందజేశారు. పుష్ప-2 చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి హీరో అల్లు అర్జున్‌తో పాటు సినీ ప్రముఖులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ బాధిత కుటుంబానికి రూ.50 లక్షల చెక్కును అందజేసింది. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని.. కనీసం కుటుంబాన్ని సైతం పరామర్శించలేదని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. అయితే, తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని అల్లు అర్జున్‌తో పాటు చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రమంలోనే తగిన సాయం అందించారు.

- December 23, 2024
0
13
Less than a minute
Tags:
You can share this post!
editor