జూ ఎన్టీఆర్ ఈ నెల 20న తన పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తారక్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) సినిమా గ్లింప్స్ విడుదల కానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. కాగా, ఇప్పుడు ‘వార్ 2’ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా నుండి తన ఫస్ట్‌లుక్ బయటకు రానుందని టాక్ నడుస్తోంది. ఇక మరోవైపు ఈ చిత్ర గ్లింప్స్‌ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తపై చిత్ర బృందం నుండి స్పష్టత రావాల్సి ఉంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
- May 5, 2025
0
167
Less than a minute
Tags:
You can share this post!
editor

