‘కాంతార’ మూవీ టీంకు యాక్సిడెంట్..పలువురికి గాయాలు

 ‘కాంతార’ మూవీ టీంకు యాక్సిడెంట్..పలువురికి గాయాలు

చిన్న చిత్రంగా విడుదలై భారీ కలెక్షన్స్ అందుకుని పాన్ ఇండియా సినిమాగా గుర్తింపు పొందింది ‘కాంతార’ చిత్రం. దీనిలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ చిత్ర విజయంతో దానికి ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్-1’ తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్ర షూటింగ్‌ సందర్భంగా మూవీ టీం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురయ్యింది. కర్ణాటకలోని  మదూరులో షూటింగ్ ముగించుకుని కొల్లూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీనిలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు 20 మందికి గాయాలు అయ్యాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం.

editor

Related Articles