హీరో వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం వెంకటేష్, ఆయనకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా నటిస్తున్న మీనాక్షి చౌదరిలపై ఓ అందమైన పాటను దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రీకరించే పనిలో ఉన్నారు. డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేష్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో ఈ ఒక్క పాటను మాత్రమే చిత్రీకరిస్తామని, త్వరలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెడతామని చిత్ర సమర్పకులు దిల్‌రాజు తెలిపారు. ఐశ్వర్య రాజేష్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేష్ తదితరులు ఇతర పాత్రధారులు.

- November 25, 2024
0
26
Less than a minute
You can share this post!
editor