థియేటర్ల వద్దకు వచ్చి అక్కడి ప్రేక్షకులను ఇంటర్యూలు చేసే యూట్యూబర్ల వల్ల సినిమాకు చాలా ప్రమాదం కలుగుతోందని అభిప్రాయపడుతున్నారు నిర్మాతలు. అందుకే వీరికి సినిమా రిలీజ్ రోజు థియేటర్లలోకి ఎంట్రీ లేదని కోలీవుడ్ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. కొద్ది మంది ఇచ్చే చెత్త రివ్యూల వల్ల సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు మారిపోతున్నాయని, సినిమా ఫలితంపై ప్రభావం చూపుతోందని మండిపడ్డారు. దీనిని నియంత్రించేందుకు తమ నిర్ణయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసింది. ఈ ఏడాది విడుదలైన ఇండియన్ 2, వేట్టయన్, కంగువా వంటి చిత్రాలపై రిలీజ్ రోజు నుండే యూట్యూబ్ ఛానల్స్ నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టాయి. దీనివల్ల సినీ పరిశ్రమ దెబ్బతింటోంది. పరిశ్రమ అభివృద్ధి కోసం సినిమా ధియేటర్ల ప్రాంగణం వద్ద యూట్యూబ్ ఛానల్స్‌ను అనుమతించకూడదు. రివ్యూల పేరుతో నటీనటులు, దర్శక నిర్మాతలపై వ్యకిగత విమర్శలను ఖండిస్తున్నాం అంటూ పేర్కొంది.

- November 21, 2024
0
82
Less than a minute
You can share this post!
editor