హీరో జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించిన సినిమా దేవర. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దేవర నవంబర్ 8 నుండి ఓటీటీలో సందడి చేస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం దేవర సినిమాను పలు విదేశీ భాషల్లో స్ట్రీమింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంగ్లీష్, కొరియన్, స్పానిష్, బ్రెజిలియన్, పోర్చుగీస్ భాషల్లో సందడి చేస్తోంది. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకు సర్‌ప్రైజ్ అనే చెప్పాలి. మేకర్స్ తీసుకున్న ఈ డెసిషన్‌తో సినిమా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు చేరడంలో కీ రోల్ పోషిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దేవర హిందీ వెర్షన్ మాత్రం ఇప్పటికీ అందుబాటులో లేకపోవడం అభిమానులకు నిరాశ కలిగించే విషయం. మేకర్స్ గ్లోబల్ స్టార్ అభిమానుల కోసం హిందీ వెర్షన్‌ను కూడా వీక్షించే వెసులు బాటు కల్పిస్తారా..? అనేది చూడాలి మరి.

- November 21, 2024
0
49
Less than a minute
Tags:
You can share this post!
administrator