కోలీవుడ్ హీరో సూర్య (కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో నటిస్తోన్న సూర్య 44 (Suriya 44) షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 కూడా చేస్తున్నాడు. సూర్య చేతిలో గొడ్డలి పట్టుకున్న ప్రీ లుక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కొత్తగా వచ్చిన యువ కంపోజర్ సాయి అభ్యాంకర్‌ను తీసుకొచ్చారు. Katchi Sera ఆల్బమ్‌తో పాపులర్ అయిన సాయి అభ్యాంకర్ మరి సూర్యకు ఎలాంటి సాంగ్స్ అందిస్తాడన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ చిత్రానికి పాపులర్ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనిచేయబోతున్నాడు. ఈ రెండు అప్‌డేట్స్‌తో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది సూర్య టీం. ఆర్జే బాలాజీ అండ్ టీం ఇటీవలే కోయంబత్తూరు అగ్రికల్చర్ కాలేజీలో షూటింగ్ సెట్ వర్క్ పనులకు సంబంధించిన విజువల్స్, స్టిల్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో త్రిష ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
- December 9, 2024
0
113
Less than a minute
Tags:
You can share this post!
editor


