చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా బలగం. జబర్ధస్త్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇందులోని ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. అయితే ‘బలగం’ సినిమా విషయంలో అగ్రపీఠం అందులో నటించిన సహనటులదే అని చెప్పవచ్చు. కొమరయ్య, ఐలయ్య, నారాయణ, లచ్చవ్వ, మొయిలన్న, నర్సి ఇలా ఏ పాత్ర చూసుకున్నా.. ఆ బలమైన పాత్ర లేకపోతే ‘బలగం’ అంత ఉద్వేగభరితంగా ఉండేది కాదు. అయితే లచ్చవ్వ పాత్ర పోషించిన రూపలక్ష్మీ ఎమోషనల్‌గా కట్టి పడేసింది. ఈ పాత్ర జనాల్ని ఇంతలా ఏడిపిస్తుందా అన్నంతగా హృదయాలని ద్రవింపజేసింది. పదేళ్ల క్రితం ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాతో రూపలక్ష్మి తెలుగు సినిమాకు పరిచయం కాగా, ఇందులోని ఆమె పాత్ర పెద్దగా నోటెడ్ కాలేదు. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం, మహర్షి, జాంబీరెడ్డి, సరిలేరు నీకెవ్వరు, క్రాక్, వకీల్‌సాబ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇన్ని సినిమాలలో చేసినా కూడా ఆమెకి ప్రత్యేక గుర్తింపు రాలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 8 ఏళ్ల తర్వాత బలగం సినిమాలో నటించి తన నటనతో సర్‌ప్రైజ్ చేసింది. ఈ సినిమా తర్వాత రూపలక్ష్మీ చాలా సినిమాలలో కీలక పాత్రలు పోషించి మెప్పించింది.

- March 13, 2025
0
42
Less than a minute
Tags:
You can share this post!
editor