కోర్ట్‌ సినిమా స‌క్సెస్‌: ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను

కోర్ట్‌ సినిమా స‌క్సెస్‌: ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను

‘కోర్ట్‌: స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’ సినిమా న‌చ్చ‌క‌పోతే నా హిట్ 3 సినిమాకు రాకండంటూ హీరో నాని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ విష‌యంపై ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టాడు హిట్ 3 ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను. హీరో నాని స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన తాజా సినిమా ‘కోర్ట్‌: స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’. ఈ సినిమాకు రామ్‌ జగదీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. హర్ష్‌ రోషన్, శ్రీదేవి జంటగా న‌టించారు. ప్రియ‌ద‌ర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రాబోతున్న‌ ఈ సినిమా మార్చి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం పెయిడ్ ప్రీమియ‌ర్స్‌ని ప్ర‌ద‌ర్శించ‌గా.. ఈ షోలు మంచి పాజిటివ్ టాక్‌ని తెచ్చుకున్నాయి. అయితే కోర్ట్ సినిమా హిట్ట‌వ్వ‌డంతో త‌న సినిమా సేఫ్ అంటూ పోస్ట్ పెట్టాడు హిట్ 3 ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను.

editor

Related Articles