తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో ఒకరు సాయిపల్లవి. ఈ హీరోయిన్ తాను చదువుకున్న కోయంబత్తూరులోని ఎవిలా స్కూల్ వార్సికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకుంది. ఈవెంట్‌లో సాయిపల్లవి మాట్లాడుతూ.. నేనిక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. కేవలం నా జ్ఞాపకాల వల్ల మాత్రమే కాదు.. నా స్కూల్ టైంలో ఎక్కువగా ఈ ఆడిటోరియంలోనే ఉండేదాన్ని. క్లాస్‌కు డుమ్మా కొట్టి.. ఇక్కడికొచ్చి డ్యాన్స్ చేసేదాన్ని. నాకిప్పుడు తెలిసిందేంటంటే.. నిజానికి నేనేం చేస్తున్నానో టీచర్లకు బాగా తెలుసు. వాళ్లు అలా చేయడం వల్ల చాలా యంగ్ ఏజ్‌లోనే నాకు స్టేజ్ ఫియర్ పోయింది. నేనిక్కడి దాకా వచ్చేందుకు నాకు సపోర్ట్‌గా నిలిచారంటూ చెప్పుకొచ్చింది. మీరు నిజంగా ఎవరో తెలుసుకోడానికి మీతో మీరు సంభాషించుకోవాలని సూచించింది సాయిపల్లవి. ఇష్టంగా డ్యాన్స్ చేయడం, మెడిసిన్ చదవడం, మంచి మనిషిగా ఉండటం అంటే ఏమిటో తెలుసుకోవడం, క్రమశిక్షణ వల్ల నాకు లభించిన ప్రతిదాన్ని నేను తిరిగి పొందుతూనే ఉన్నాను. పిల్లలతో నా ఐడియాలను పంచుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది చివరలో మళ్లీ స్కూల్‌కు వస్తాను అని చెప్పింది సాయిపల్లవి.

- January 24, 2025
0
29
Less than a minute
Tags:
You can share this post!
editor