హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. పుష్ప పార్ట్ 1 సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదల రోజు నుంచే అటు రికార్డులతో పాటు పలు వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా బెనిఫిట్ షో రోజు సంధ్య థియేటర్ వద్ద మహిళ మృతి చెందడంతో ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యాడు. ఇక పుష్ప నమోదు చేసిన రికార్డులు చూసుకుంటే.. కేవలం 32 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.900 కోట్లు కేవలం హిందీ ఫీల్ట్ నుంచి రావడమే విశేషం. ఇవే కాకుండా.. ఫస్ట్ డేనే.. రూ.294 కోట్లు వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక శుభాకాంక్షలను ఫ్యాన్స్‌కు తెలియజేసింది.

- January 24, 2025
0
25
Less than a minute
Tags:
You can share this post!
editor