ఆర్‌సీ16 టీం రెహమాన్ ప్లేస్‌లో దేవీ శ్రీ ప్రసాద్‌..?

ఆర్‌సీ16 టీం రెహమాన్ ప్లేస్‌లో దేవీ శ్రీ ప్రసాద్‌..?

టాలీవుడ్ హీరో రాంచరణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన  డైరెక్షన్‌లో నటిస్తున్న సినిమా ఆర్‌సీ16. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జ‌న‌వ‌రి 27 నుండి హైద‌రాబాద్‌లో మూడో షెడ్యూల్ మొద‌లు కానుంది. జులైక‌ల్లా షూటింగ్ పూర్తి చేసి.. ద‌స‌రా లేదా డిసెంబ‌ర్ మొద‌టి వారంలో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నార‌ని ఇప్పటికే వార్తలు అందుతున్నాయి. మరో క్రేజీ గాసిప్‌ కొన్ని రోజులుగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్‌ విన్నింగ్ కంపోజర్‌ ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ అందిస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఏఆర్‌ రెహమాన్‌కు బదులు రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ను రీప్లేస్‌ చేశారని ఇండస్ట్రీ సర్కిల్‌లో వార్తలు రౌండప్ చేస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియడంలేదు.

editor

Related Articles