లిప్‌కిస్ పెట్టిన బాలీవుడ్ సింగ‌ర్ ఎవరు..?

లిప్‌కిస్ పెట్టిన బాలీవుడ్ సింగ‌ర్ ఎవరు..?

బాలీవుడ్ సింగ‌ర్ ఉదిత్ నారాయణ్ వివాదంలో చిక్కుకున్నాడు. త‌న క‌న్స‌ర్ట్‌లో భాగంగా.. ఒక మ‌హిళా అభిమానికి లిప్ కిస్ పెట్టగా అది వివాదంగా మారింది. త‌న గాత్రంతో బాలీవుడ్ సినిమాల‌కు ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్లు అందించాడు. తెలుగులో ఈ సింగ‌ర్ ‘అందమైన ప్రేమరాణి’, ‘అందాల ఆడబొమ్మ’, ‘కీరవాణి రాగంలో’, ‘పసిఫిక్‌లో దూకేమంటే’, ‘అమ్మాయే సన్నగా’ వంటి సూప‌ర్ హిట్ పాటలు పాడి తెలుగు ప్రేక్షకులకు ద‌గ్గ‌ర‌య్యారు. క‌న్సర్ట్‌లో భాగంగా.. ఒక మ‌హిళా అభిమాని సెల్ఫీ తీసుకుందామ‌ని ఉదిత్ ద‌గ్గ‌రికి వెళ్లింది. అత‌డితో సెల్ఫీ దిగిన అనంత‌రం చెంప‌పై ముద్దు పెట్టింది. దీంతో ఉదిత్ కూడా ఎడ్వాన్‌టేజ్‌గా తీసుకుని ఆ అభిమానికి ఏకంగా లిప్ కిస్ పెట్టడంతో లేడి ఫ్యాన్ ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

editor

Related Articles