బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రెగ్నెంట్‌గా ఉన్న టైమ్‌లోనే ‘కల్కి’ సినిమాని పూర్తి చేసిన దీపిక.. ఆ తర్వాత సినిమాల నుండి కాస్త విరామం తీసుకుంది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఇదిలా ఉండగా.. దీపికా పదుకొణె డెలివరీ తర్వాత తొలిసారి ఓ షోలో పాల్గొని ర్యాంప్‌పై కేట్‌వాక్ చేసింది. సబ్యసాచి 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దీపిక.. డిఫరెంట్ లుక్‌లో తళుక్కుమని మెరిసింది. తెల్లటి దుస్తులు ధరించి కళ్లజోడు, వెరైటీ హెయిర్‌స్టైల్‌తో ర్యాంప్ వాక్ చేసింది. పాపకు దువా పదుకొణె సింగ్ అని పేరు పెట్టారు. ‘రామ్ లీలా’ అనే సినిమాలో తొలిసారి కలిసి నటించారు రణవీర్ సింగ్, దీపికా పదుకొణె. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

- January 27, 2025
0
28
Less than a minute
Tags:
You can share this post!
editor